ఆ క్లైమాక్స్ ను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి

ఈ శుక్రవారం విడుదలవుతున్న ఏకైక తెలుగు చిత్రం “మజిలీ”. “నిన్ను కోరి” లాంటి డీసెంట్ హిట్ అనంతరం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య-సమంత జంటగా నటించడం విశేషం. క్రికెట్ నేపధ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రైలర్ విడుదలైన తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ లో చూసిన కంటెంట్ వరకూ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని మాత్రమే అందరూ ఫిక్స్ అయ్యారు.

కట్ చేస్తే.. ఈ సినిమాలో అంతకుమించిన ట్విస్ట్ మరొకటి ఉందని తెలుస్తోంది. సెకండాఫ్ లో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ ఆడియన్స్ ని షాక్ కు గురి చేయడమే కాక ఎమోషనల్ చేసేస్తుందట. ఆ ట్విస్ట్ ఏమిటనేది ఇక్కడ చెబితే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పాడవుతుంది కాబట్టి చెప్పడం లేదు. సో, “మజిలీ” ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉండబోతోంది అనేది మాత్రం కన్ఫర్మ్.

Share.