‘A1 ఎక్స్‌ప్రెస్‌’ ప్రి రీలీజ్‌ ఈవెంట్‌లో రామ్‌ చొక్కా చూశారా?

టాలీవుడ్‌ హీరోల్లో స్టయిలిష్‌ స్టార్‌ అంటే అల్లు అర్జున్‌ అని చెబుతారు. అలా అని మిగిలిన హీరోలు స్టయిల్‌గా ఉండరని కాదు.. వాళ్లకు స్టయిల్‌ తెలియదనీ కాదు. ఇప్పుడు ఈ స్టైల్‌ గురించి ఎందుకు చెబుతున్నాం అంటారా? తాజాగా టాలీవుడ్‌ హీరోల స్టయిల్‌ ప్రొఫైల్‌ చూసి.. మాట్లాడాలి అనిపిస్తోంది. స్టయిల్‌ అంటే కలర్‌ఫుల్‌ చొక్కా, చక్కటి జీన్‌ అనుకునే రోజులు పోయాయి. చిత్రవిచిత్రమైన డ్రెస్‌లు బయటికొచ్చాయి. ఫ్యాషన్లు కనిపిస్తున్నాయి. దానికి ఆధ్యుడు విజయ్‌ దేవరకొండ అని చెప్పాలి. నైట్‌ డ్రెస్‌తో పార్టీకి వచ్చి ఫ్యాషన్‌ అని చెబుతున్న రోజులివి. ఇప్పుడు ఆ స్టయిల్‌ను రామ్‌ ఫాలో అవుతున్నాడా?.. అవుననే చెప్పాలి.

సందీప్‌ కిషన్‌ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రామ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. స్టేజీ మీద చాలా మాసీగా మాట్లాడి అభిమానుల్ని అలరించాడు. ఈ క్రమంలో రామ్‌ డ్రెస్‌ స్టయిల్‌ను ఒకసారి గమనించాలి. చొక్కా పై గుండీలను వదిలేసి… కింది బటన్స్‌ను మధ్యలో పెట్టుకొని ‘అదోమాదిరి’ ఫ్యాషన్‌ పాటించాడు. ఈవెంట్‌ మొత్తం అలానే కనిపించాడు. నిజానికి ఇదేం కొత్త ఫ్యాషన్‌ కాదు. మనందరం ఎప్పుడో ఒకసారి అలా చొక్కా గుండీలు మరచిపోయి వేసుకునే ఉంటాం.

చిన్నతనం అలా గుండీలు మరచిపోయి చొక్కా వేసుకుంటే… ఫ్రెండ్స్‌ నవ్వేవారు గుర్తుందా. ఇప్పుడు హీరోలు ఆ పని చేసేసరికి ఫ్యాషన్‌ అంటున్నారు. ఇంకా లేదంటే మాస్‌ లుక్‌ అంటున్నారు. ఏదేమైనా ఫ్యాషన్‌ చేసే పనిలో కాదు… చేసిన మనిషిలో ఉంటుందని ఊరకనే అన్నారా. ఈ మాట ఎవరన్నారా అనుకుంటున్నారా.. మొన్నామధ్య ఎవరో హీరో ఫ్యాన్‌ ట్విటర్‌లో అన్నారులెండి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.