ఆ అగ్ని ప్రమాదం కావాలనే చేసిందా…

ప్రభాస్‌ హీరోగా ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రకటించినప్పుడు అందరూ చాలా ఆనందపడ్డారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేశ్‌గా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను తీసుకుంటారని తెలిశాక.. ఆ ఆనందం డబుల్‌ అయ్యింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సినిమా గురించి, సినిమాలో రావణుడు పాత్ర గురించి సైఫ్‌ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత దానిపై అతను స్పందించినా… ఆందోళనలు ఆగలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆగండాగండి.

ఆ విషయం చెప్పేలోపు… ‘ఆదిపురుష్‌’ సినిమా చిత్రీకరణ మొదలవ్వగానే సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం మీకు గుర్తుందా?.. ఆ ప్రమాదానికి, సైఫ్‌ వ్యాఖ్యలకు సంబంధం ఉందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆదిపురుష్‌’ సెట్‌లో జరిగింది ప్రమాదం కాదని, దాని వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదం జరిగిన వెంటనే వార్తలొచ్చిన విషయం విదితమే.

రావణుడి పాత్రపై సైఫ్‌ వ్యాఖ్యల విషయంలో ఈ మధ్య కాలంలో ఎలాంటి స్పందనలు లేవు అనుకుంటున్న సమయంలో ఇలా ఒక వార్తలు/పుకార్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. సినిమా విడుదల సమయం దగ్గర పడేసరికి ఇంకెంత ఇష్యూ క్రియేట్‌ అవుతుందో చూడాలి. లేకపోతే విడుదలకు ముందే చిత్రబృందం సైఫ్‌ వ్యాఖ్యల ఇష్యూస్‌ క్లియర్‌ చేసుకుంటుందో చూడాలి. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైన విషయం తెలిసిందే.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.