ఇలా అన్నీ కత్తిరించుకుంటూ పోతే ఎలా బాస్‌

చిరంజీవి లూసిఫర్‌ సినిమా రీమేక్‌ చేస్తున్నారు అనగానే… చాలామంది నోట వినిపించిన మాట ‘ఎందుకు?’. మోహన్‌లాల్‌ నటించిన ఆ సినిమా తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.. చాలామంది చూసేశారు కూడా. దీంతో మళ్లీ తీసి ‘కాటమరాయుడు’లా చేతులు కాల్చుకుంటారేమో అనే వాదనలు వినిపించాయి. అయితే హీరో పాత్రలో చిరంజీవిని చూసి మురిసిపోదాం అనుకునేవారూ ఉన్నారు. చిరు టీమ్‌ ఆలోచన కూడా అదే. త్వరలో ఈ సినిమా మొదలవబోతోంది. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి.

‘లూసిఫర్‌’ హీరో పాత్రకు హీరోయిన్‌ ఉండదు, తండ్రి ఎవరో తెలియదు, కామెడీ పండించే స్కోప్‌ ఉండదు. ఇలా చాలా విషయాల్లో చిరంజీవి ఎలిమెంట్స్‌ సినిమాలో కనిపించవు. కానీ తెలుగు ‘లూసిఫర్‌’లో దీని కోసం చాలా మార్పులు చేస్తున్నారని తెలిసింది. చిరు అభిమానులకు కావాల్సిన మాస్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేస్తున్నారట. అందులో భాగంగా హీరోయిన్‌ పాత్రను పెడుతున్నారట. తండ్రి ఎవరు అనే టాపిక్‌ను తీసేస్తున్నారట. కామెడీని కూడా యాడ్‌ చేస్తున్నారట. ఇవన్నీ ఓకే.. ఇప్పుడు మరో పాయింట్‌ కూడా వినిపిస్తోంది.

సినిమా క్లైమాక్స్‌లో టొవినో థామస్‌ క్యారెక్టర్‌ సినిమాకు అదనపు బలం తీసుకొచ్చింది. దీంతో ఈ పాత్ర ఎవరు చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొన్నటివరకు సత్యదేవ్‌కు ఆ పాత్ర ఇస్తారని అన్నారు. కాదు కాదు స్టార్‌ హీరోతో చేయిస్తారని వాదనలూ వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఆ పాత్రనే తొలగించేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కష్టమే. సినిమా కీలక పాయింట్లను ఇలా కత్తిరించుకుంటే వెళ్లిపోతే ఎలా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.