మళ్ళీ మాస్ హీరో ఇమేజ్ కోసం ఆరాటపడుతున్న అఖిల్

పాపం అదృష్టం కలిసిరాకో.. సమయం కలిసిరాకో అక్కినేని అందగాడు అఖిల్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా సాధించలేకపోయాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న అఖిల్.. ఈ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. “గద్దలకొండ గణేష్” సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన హరీష్ శంకర్.. తదుపరి సినిమా ఓ బడా స్టార్ తో అని గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ ఆ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు రావడానికి చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది.

Akhil Akkineni With Harish Shankar

అయితే.. ఈలోపు హరీష్ శంకర్-అఖిల్ ల కాంబినేషన్ వర్కవుట్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ హరీష్ & అఖిల్ ల నడుమ సినిమా చేయాలనే డిస్కషన్ ఏమీ జరగలేదు. మరి హరీష్ దర్శకత్వంలో అఖిల్ నటించే సినిమా కథ సెట్ అయ్యి.. ప్రొజెక్ట్ సెట్స్ మీదకు రావడానికి ఎంత టైమ్ పడుతుందో తెలియదు కానీ.. ఈ రూమర్స్ మాత్రం వినడానికి బాగున్నాయి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.