రాజమౌళి అనౌన్స్ చేయబోతున్న నటులు వీళ్ళేనా..?

‘ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ సరిగ్గా జరగడం లేదు, సినిమా అనుకున్న టైంకు విడుదలయ్యే అవకాశం లేదు’.. ఇలా ఎన్నో రూమర్లు వచ్చాయి. అయితే వీటన్నికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా దర్శకుడు రాజమౌళి అండ్ టీం డిసైడ్ అయ్యరు. నిన్న ఒక్కసారి గా ఓ అనౌన్స్ మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చారు. నవంబర్ 20న(ఈరోజు) ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ తో పాటు విలన్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తారు అనే విషయాన్ని రెవీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది అని చెప్పడాన్ని బట్టి చూస్తే వారు అనుకున్న టైంకే సినిమాని విడుదల చేయబోతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది.

Alison Doody and Olivia Morris in RRR Movie

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటించే ఆ రెండు పాత్రల పేర్లు ఇవేనంటూ ఫిలింనగర్లో పెద్ద చర్చ జరుగుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ లో లేడీ విలన్ పాత్ర కోసం హాలీవుడ్ సీనియర్ నటి ఆలిసన్ డూడి ని ఎంచుకున్నారని తెలుస్తుంది. ఐర్లాండ్ కు చెందిన ఈ నటి ఇండియానా జోన్స్(1989),టాఫిన్, మేజర్ లీగ్ 2 వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమధ్య కాలంలో ఆలిసన్ డూడి 2017లో వచ్చిన ‘డేవిడ్ సన్’ 19 చిత్రంలో నటించింది. అలాగే మరో ఐరిష్ యాక్టర్ రేమండ్ స్టీవెన్సన్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. వీరితో పాటు ఒలీవ మోరిస్ అనే నటి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్త ప్రచారంలో ఉంది. ఇక ఈ విషయంలో నిజం ఎంత ఉందో.. అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదనే చెప్పాలి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.