‘నీలి నీలి ఆకాశం’ వెనుక ఇంత జరిగిందా?

లాక్‌డౌన్‌ టైమ్‌లో యూట్యూబ్‌లో చాలా పాటలు దుమ్ము రేపాయి. అందులో ‘నీలి నీలి ఆకాశం…’ పాట ఒకటి. ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమైన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలోని పాట అనే విషయం మనకు తెలిసిందే. ఈ పాట ఎంత హిట్‌ అయ్యింది అంటే… ‘పాటంత బాగుంటుంది సినిమా’ అంటూ ప్రచారం చేసే రేంజిలో హిట్టయింది. ఈ పాటను ప్రముఖ రచయిత చంద్రబోస్‌ రాశారు. ఈ పాట గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించారు.

ఈ పాట ఫీమేల్‌ వెర్షన్‌ను ప్రముఖ గాయని సునీత ఆలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటకు ఆమె అయితేనే బాగుంటుందని చంద్రబోసే సూచించారట. అంతే కాదు దీని కోసం సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌తో గొడవ పడటానికి సైతం సిద్ధపడ్డారట. ఈ విషయాన్ని చంద్రబోస్‌ ఇటీవల ఓ కార్యక్రమం తెలియజేశారు. ‘‘ఈ పాటను రాస్తున్న సమయంలోనే ఫీమేల్ వెర్షన్‌ను సింగర్‌ సునీత పాడితే బాగుంటుందని అనుకున్నాను. ఆమెను తీసుకోవాలంటూ సంగీత దర్శకుడికి ముందే చెప్పాను. అంతేకాదు ఆమెపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. పాట సూపర్‌ హిట్‌ అవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించారు’’ అని చెప్పుకొచ్చారు చంద్రబోస్‌.

‘నీలి నీలి ఆకాశం…’ పాట సునీత భర్త రామ్‌ వీరపనేనికి కూడా బాగా ఇష్టమట. ఆమె తరచు ఇలాంటి పాటలను ఎంపిక చేసుకోవాలని పాడాలని ఆయన సూచించారట. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డులు కొడుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ పాటకు 22 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 12 లక్షల మంది పాటను లైక్‌ చేశారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Share.