సుధీర్ బాబు-ఇంద్రగంటి కాంబినేషన్ సినిమా టైటిల్ చూసారా ?

కొంతమంది హీరోయిన్స్ కి స్టార్ డమ్ రావడానికి అయిదారేళ్లు పడుతుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రకుల్, పూజా హెగ్డేలకు మొదటి హిట్ అందుకోవడానికి దాదాపు అయిదారేళ్లు పట్టింది. ఇక వాళ్ళు కమర్షియల్ హిట్స్ అందుకొని వరుస అవకాశాలు అందుకొని బిజీ అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ టైమ్ పట్టింది. కానీ పుట్టడమే సుడితో పుట్టిందో లేక పెరిగాక అదృష్టం తగులుకుందో తెలియదు కానీ.. కృతిశెట్టి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

తొలి చిత్రం “ఉప్పెన”తోనే స్టార్ హీరోయిన్ అయిపోవడంతోపాటు 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయింది. రామ్ సరసన కథానాయికగా అవకాశం అందిపుచ్చుకుంది. అయితే.. ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కృతిశెట్టి గురించి సుధీర్ బాబు ఏదో చెబుతానంటున్నాడు. ఆ విషయం ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మేటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సమంత మేనేజర్ మహేంద్ర, కృతిశెట్టి మేనేజర్ కిరణ్ లు నిర్మాతలుగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ కాస్త పొడవుగా ఉన్నా.. అర్ధవంతంగా ఉండి ఇంద్రగంటి మార్క్ సినిమా అని చెప్పకనే చెబుతుంది. మరి సుధీర్ బాబు హీరోయిన్ కృతిశెట్టి గురించి ఏ విషయం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.