సినిమా సీన్స్ మళ్లీ లీకయ్యే ఛాన్స్ ఉందా..?

బాహుబలి ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత యస్ యస్ రాజమౌళి చేస్తున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ట్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం సినిమా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరమ్ అల్లూరిగా కనిపిస్తున్న ఈసినిమాని జక్కన్న తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. దాదాపుగా షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి అయిపోయినట్లే అని టాక్. అతి త్వరలోనే సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా ఉండటం వల్లే రిలీజ్ డేట్ కి అక్టోబర్ వరకూ పెట్టారని అంటున్నారు. దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ పార్ట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టే అంత టైమ్ తీస్కున్నారని అంటున్నారు.

ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది కానీ, మళ్లీ ఈసినిమాలో క్లిప్పింగ్స్ లేదా సీన్స్ లీకయ్యే ఛాన్స్ ఉందా అనేది మాత్రం డౌట్ గానే ఉంది. లాస్ట్ టైమ్ ఇలాగే బాహుబలి 2కి సంబంధించిన ఒక వార్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఎడిటింగ్ లో ఎక్కువరోజులు ఉండటం, విఎఫెఎక్స్ కి ఎక్కువ సమయం పట్టడం వల్లే ఇలా జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి కూడా. గతంలో రాజమౌళి మగధీర సినిమాకి కూడా ఇదే సమస్య ఎదురైంది. మరి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ లాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఎక్కడ్నుంచి లీక్ అవుతుందో అనే భయం చిత్రయూనిట్ ని వెంటాడుతోందట.

అందుకే చాలా పకడ్భందీగా అన్ని పాస్ వర్డ్స్ తో అవుట్ పుట్ ని లాక్ చేస్తున్నారని సమాచారం. అవసరమైనంత వరకూ మాత్రమే ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ గా ఎడిటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకూ వచ్చిన రషెష్ చూసిన చిత్రయూనిట్ అవుట్ పుట్ అదిరిందని చెప్తున్నారు. ఇద్దరు తెలుగు వీరుల్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Share.