‘ఇద్దరి లోకం ఒకటే’ ట్రైలర్ రివ్యూ..!

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒక్కటే’. రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జి.ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసాడు. అంతక ముందు ఈ దర్శకుడు సుధీర్ బాబుతో ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో ఇప్పటి వరకూ మరో సినిమా చేసే అవకాశం దక్కలేదు. ఇక తాజగా ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం నుండీ ట్రైలర్ ను విడుదల చేశారు.

Iddari Lokam Okate Movie Trailer Review1

‘లైఫ్ ప్రతీవాడికి ఒక మూమెంట్ లో ఎక్ష్పెక్ట్ చెయ్యని ఓ సర్ప్రైజ్ ఇస్తుంది’.. అంటూ రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఖుషీ స్టైల్ లో హీరో, హీరోయిన్లు ఒకే హాస్పిటల్ లో పుడతారు. కొన్నాళ్ళ తరువాత ‘హలో’ స్టైల్ లో కలుసుకుని విడిపోతారు. మళ్ళీ చాలా సంవత్సరాలు తర్వాత ఊటీ లో కలుసుకుంటారు. కానీ ఆ తరువాత నాని, గౌతమ్ మీనన్ ల ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా స్టైల్ లో విడిపోతూ… కలుసుకుంటూ ఉంటారు’ అని స్పష్టమవుతుంది. ట్రైలర్ చాలా నీరసంగా సాగింది. ఏమాత్రం కొత్తదనం లేదు. చివర్లో ‘గీతాంజలి’ చిత్రంలో ‘ఓం నమహా’ సాంగ్ పెట్టి.. ఆ సినిమా లవర్స్ ను అట్రాక్ట్ చెయ్యాలి అనుకున్నప్పటికీ.. ఆ ప్లాన్ కూడా వర్కౌట్ అయినట్టు లేదు. ఓపిక ఉంటే మీరు కూడా ట్రైలర్ చూడండి. ఇక ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.