నాని హీరోయిన్ ఇలాంటి కామెంట్లు చేస్తుందేంటి..!

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో తన గ్లామర్ పాత్రతో పాటు.. ఓ పిల్లాడికి తల్లిగా కూడా నటించింది. ఓ మధ్య తరగతి కుటుంబంలో బాధ్యతలేని భర్తను భరించే ఇల్లాలి పాత్రలో శ్రద్దా మంచి మార్కులే కొట్టేసింది. ఆమె హీరో ఆదితో నటించిన ‘జోడి’ చిత్రం సెప్టెంబర్ 6 న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

jersey-actress-shraddha-srinath

శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ.. “నిజ జీవితంలో నాకు పిల్లల్ని కనే ఆలోచన లేదు. మా తాతయ్య..బామ్మలు 15 మంది పిల్లల్ని కన్నారు. నా తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు. కానీ నేను మాత్రం పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంతో నేనెలాంటిదాన్నో డిసైడ్ చేయొద్దు..! నా చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించండి… అంటూ చెప్పుకొచ్చింది శ్రద్దా. ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది శ్రద్దా శ్రీనాథ్.

Share.