ఆమె నెంబర్ కోసం ఆ స్టార్ ప్రొడ్యూసర్ కి మెసేజ్ పెట్టాను

ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు, స్టార్ డమ్ కు హీరోయిన్లు కానీ వేరే అమ్మాయిలూ కానీ మనోడి వెంట పడాలి కానీ.. విచిత్రంగా విజయ్ మాత్రం ఒక స్టార్ హీరోయిన్ ఫోన్ నెంబర్ కోసం నానా తంటాలు పడ్డాడట. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. తన అందంతోపాటు అభినయంతోను బాలీవుడ్ ను మాత్రమే కాక యావత్ ఇండియన్ ఆడియన్స్ ను తన ఫాన్స్ గా మార్చేసుకొన్న ఆలియా భట్. ఇటీవల వోగ్ మ్యాగజైన్ కు స్పెషల్ ఫోటోషూట్ చేయడంతోపాటు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన విజయ్ దేవరకొండ..

vijay-devarakonda-alia-bhatt

ఆ సందర్భంలో మాట్లాడుతూ “నేను గల్లీ బాయ్ సినిమా చూసి బాగా ఎగ్జైట్ అయిపోయాను. రణవీర్ సింగ్ నటన కంటే ఆలియా భట్ పెర్ఫార్మెన్స్ నన్ను బాగా ఆకట్టుకొంది. వెంటనే ఆమెకు ఫోన్ చేసి అభినందించాలని, సినిమా చుసిన తర్వాత తనకు కలిగిన భావనను పంచుకోవాలని అనిపించింది కానీ.. నా దగ్గర ఆమె నంబర్ లేదు. నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆమె నంబర్ లేదు. దాంతో.. అప్పటికప్పుడు కరణ్ జోహార్ గారికి కాల్ చేసి.. నంబర్ అడిగి, అప్పుడు ఆమెకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పేవరకు నా మనసు నాలో లేదు” అని చెప్పుకొచ్చాడు విజయ్. ఇకపోతే.. విజయ్ నటించిన “డియర్ కామ్రేడ్, గీత గోవిందం” చిత్రాలు త్వరలోనే హిందీలో రీమేక్ అవ్వనున్నాయి.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.