‘వాల్మీకి’ కోసం మెగాస్టార్ ని వాడేసాడట..!

ఇప్పటి వరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ కొన్ని హిట్లు, ఒకటి రెండు డిజాస్టర్లు తన అకౌంట్లో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఫలితం ఏదైనా కచ్చితంగా వరుణ్ మంచి సినిమానే తీస్తాడు అనే నమ్మకం అయితే ప్రేక్షకుల్లో ఉంది. దీంతో వరుణ్ సినిమా అంటే యూత్ సైతం ఎగపడుతుంటారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు ‘వాల్మీకి’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ 20 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు వరుణ్ తేజ్.

i-copied-my-look-from-chiranjeevi-says-varun-tej-1

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. ” ‘వాల్మీకి’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరంజీవిగారిని ఇమిటేట్ చేసారంట నిజమేనా? అని వరుణ్ ను విలేకరి ప్రశ్నించగా…? దానికి వరుణ్ బదులిస్తూ.. “అవునండీ.. చిరంజీవిగారి లుక్‌ని కాపీ కొట్టాను. నిజానికి డాడీనే ఈ లుక్ నాకు పంపారు. ‘పునాదిరాళ్ళు’ స‌మ‌యంలో పెదనాన్న అలానే ఉండేవారు అని. అదే హెయిర్ స్టైల్‌ని నేను ఇందులో ట్రై చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.