శేష్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటి?

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలైనా సరే ప్రీమియర్లు వేయడానికి భయపడిపోతున్నారు. సినిమాకి మంచి టాక్ వస్తే పర్వాలేదు.. కానీ ప్లాప్ టాక్ వస్తే మాత్రం.. ఆ ఎఫెక్ట్ మొదటి రోజు కలెక్షన్ల పై పడుతుంది. కనీసం వీకెండ్ కూడా అటువంటి సినిమాలు క్యాష్ చేసుకోలేకపోతున్నాయి. ఈఏడాది విడుదలైన బాలకృష్ణ, క్రిష్ ల ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రానికి కూడా అదే గతి పట్టింది. దీంతో స్టార్ హీరోలు సైతం తమ సినిమాకి ప్రీమియర్ షోలు వేయడానికి భయపడుతున్నారు. ఇలాంటి టైంలో అడివి శేష్ ఆ సాహసం చేస్తున్నాడు. వెంకట్ రాంజీ డైరెక్షన్లో అడివి శేష్ హీరోగా నటించిన ‘ఎవరు’ చిత్రానికి ప్రీమియర్ షో వేస్తున్నారు.

adivi-seshs-evaru-movie-releasing-on-august-15th

ఈ చిత్రం ప్రమోషన్లో ఈ విషయం పై అడివి శేష్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన బదులిస్తూ… “సాధారణంగా ప్రీమియర్స్ వేయడానికి కొంతమంది భయపడుతుంటారు. ఒకవేళ సినిమా బాగోలేకపోతే ఆ టాక్ బయటికి వెళ్ళిపోతుందని ఆందోళన చెందుతుంటారు. ‘ఎవరు’ విషయంలో నేను అలా భయపడటం లేదు. సినిమా ఇండస్ట్రీతో సంబంధమేలేని ఒక వెయ్యిమందికి ‘ఎవరు’ చూపించాను. థియేటర్లో వాళ్ళు మాత్రమే ఉండేలా చూశాను. సినిమా పూర్తయిన తరువాత ఎలా వుందని ఎవరినీ అడగొద్దని బయటనే వున్న నా మనుషులకు చెప్పాను. ఆ వెయ్యిమంది ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో, ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయమనే విషయం నాకు అర్థమైపోయింది” అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్.

Share.