బికినీలు, పొట్టి డ్రెస్సులు వేసుకోను!

టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ఎన్నుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బికినీల్లో ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులతో పంచుకుంటోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బికినీలో ప్రదర్శన ఇవ్వడంపై ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది.

ఇక బికినీ అందాలన్నీ కేవలం ఆఫ్ స్క్రీన్ కే పరిమితమని చెబుతోంది. వెండితెరపై బికినీలో అసలు కనిపించనని స్పష్టం చేసింది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో అభిమానులు తనను ఊహించుకోలేరని తాప్సీ చెప్పుకొచ్చింది. ‘జుద్వా’ సినిమాలో తప్ప మరే ఇతర సినిమాల్లో బికినీలో తాను కనిపించలేదని చెప్పుకొచ్చింది. అలాగే గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం తనకు నచ్చదని తెలిపింది. ఓవర్ గాఎక్స్‌ఫోజింగ్ చేసినా అభిమానులు తనను స్వీకరించరనే విషయం తనకు బాగా తెలుసని చెప్పింది.

ఈ కారణంగానే ఇకపై సినిమాల్లో బికినీ ధరించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. సో ఇకపై తాప్సీని ఆన్ స్క్రీన్ పై బికినీతో చూడలేమన్నమాట. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు హిందీ సినిమాల్లో ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.