నాగశౌర్య కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాకిచ్చారు. ఇటీవల నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకి బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి గమనించారు. వెంటనే ఆయనకి 500 రూపాయల ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ను కూడా పోలీసులు తొలగించడం జరిగింది. ఈ సంఘటన ఆగష్టు 13 న (నిన్న) బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1లో జరిగింది. ఇండియాలో కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ వాడటం పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

hyderabad-police-shocks-naga-shaurya1

మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ‘కార్ వ్యాన్’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో నాగశౌర్య కూడా చేరాడు. ఇప్పుడు ఈ విషయం పై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ‘హీరోలయ్యుండి కూడా కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే… ఈమధ్యే నాగశౌర్య.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ బేబీ’ లో నటించాడు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌ అయిన ‘ఐరా క్రియేషన్స్’ లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు. మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

hyderabad-police-shocks-naga-shaurya2

Share.