ఆ మృతదేహం వెనుక అసలు కారణం ఏమిటంటే..!

ప్రస్తుతం ‘కింగ్’ నాగార్జున ‘బిగ్ బాస్ సీజన్ 3’ హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా… తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన పొలంలో ఓ గుర్తుతెలియని మృతదేహం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం పాపిరెడ్డి గూడలో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలో కుల్లిపోయిన మృతదేహం బయటపడింది. ఈ డెడ్ బాడీ కుళ్ళిపోయి ఉంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసులకు తెలియజేసారు.

human-skeleton-found-in-actor-nagarjunas-farm-house1

అసలు విషయం ఏమిటంటే.. 40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా.. సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారట నాగార్జున. దీని పై కొందరు నిపుణులను అక్కడకు పంపారు నాగార్జున. ఈ క్రమంలో… పొలంలోకి వెళ్ళిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్ళిపోయిన మృతదేహాన్ని వారు గుర్తించి…. పోలీసులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా ఆ శవం దొరికిన గదిని కూడా సీజ్ చేశారు. ఇక చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు..? ఎప్పుడు మరణించాడు..? ఆ వ్యక్తిమరణం వెనుక కారణాలేమిటి? అనే విషయాల పై దర్యాప్తు చేపట్టారు. మరి ఈ విషయం పై నాగార్జున ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.