పూజా కోసం అయిదు కోట్ల ఖర్చు.. డిమాండ్ అలా ఉంది!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అల వైకుంఠపురంలో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తాజాగా ప్రకటించారు. ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ‘అలకనంద’ అనే పాత్రలో పూజా కనిపించబోతుందని సమాచారం. ఇక ఈమె ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన అమ్మాయి గా కనిపించబోతుందట. దీంతో ఈమె ఇంటి సెట్ ను కూడా ప్రత్యేకంగా వేస్తున్నారట.

huge-set-for-ala-vaikunthapuramu-lo-movie1

హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఈమె ఇంటి కోడం భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. ఏకంగా 5 కోట్లతో ఈ ఇంటిని నిర్మించబోతున్నట్టు సమాచారం. పూజా హెగ్డే తో పాటు టబు, బొమన్ ఇరాని తదితరుల పై ఈ ఇంటి సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. అంతేకాదు ఒక పాట చిత్రీకరణ కూడా ఈ ఇంటి సెట్లోనే చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

Share.