మహేష్ సినిమాకు విచిత్రమైన సమస్య.. ఏమైందంటే..?

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. 2022 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని కీర్తి సురేష్ సర్కార్ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో చేరుతుందని భావిస్తున్నారు.

కరోనా, లాక్ డౌన్ వల్ల సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ ఆలస్యం కాగా ఈ సినిమాకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి విచిత్రమైన సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. మహేష్ కు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేశాయి. మహేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సర్కార్ వారి పాటకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు.

అయితే కరోనా వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అడ్వాన్స్ లు ఇచ్చి సినిమా రిలీజ్ సమయానికి బిజినెస్ పుంజుకుంటే నిర్మాతలు డిమాండ్ చేసిన మొత్తం ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టు సమాచారం. సర్కార్ వారి పాట నిర్మాతలకు ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల ద్వారా రూ.25 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఓవర్సీస్ లో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా 23 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సర్కార్ వారి పాట కనీసం 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.