సంక్రాంతి కే ‘వెంకీమామ’ కూడా.. భారీ పోటీనే..!

సంక్రాంతికి ఇప్పటికే.. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ , రజినీకాంత్ ‘దర్బార్’, కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాలతో గట్టి పోటీ ఏర్పడుతుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మామా అల్లుళ్లు కూడా షాకివ్వడానికి రెడీ అవ్వబోతున్నారు.

venky-mama-movie-first-look

అవును వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న ‘వెంకీమామ’ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నారట దర్శకనిర్మాతలు. అదేగాని జరిగితే సంక్రాంతి కి బాక్సాఫీస్ మరింత హీట్ ఎక్కబోతుంది అనడంలో సందేహమే లేదు. ‘వెంకీ మామ’ మొదట దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ చాలా వరకూ మళ్ళీ రీషూట్లు చేసే పనిలో పడ్డారని సమాచారం. మరి ఇది నిజమో కాదో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే కాని చెప్పలేము.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.