‘టక్ జగదీష్’.. హోల్‌సేల్‌గా అమ్మేశారా..?

తన సహజ నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని. మార్కెట్ లో ఆయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ప్లాప్ లు వచ్చినప్పటికీ ఆ ఎఫెక్ట్ ఎంతమాత్రం ఈ హీరోపై పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ‘వి’ సినిమా కూడా నిరాశ పరిచింది. అయినప్పటికీ తన కొత్త సినిమాపై ఈ ప్రభావం పడుతున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ రెండు నెలల క్రితమే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా బిజినెస్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అధినేత ‘టక్ జగదీష్’ సినిమా రషెస్ చూసి ఇంప్రెస్ అయి.. ఈ సినిమానుహోల్‌సేల్‌గా కొనేసినట్లు తెలుస్తోంది. రూ.47 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు సమాచారం. అయితే ఇందులో అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే ఉన్నాయా..? లేక డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయా..? అనే విషయంలో స్పష్టత లేదు.

కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే అయితే గనుక నిర్మాతలు జాక్ పాట్ కొట్టినట్లే.. గతంలో నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘టక్ జగదీష్’కి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. మరి యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.