కళ్యాణ్ రామ్ కోసం ఉప్పెన లాంటి బడ్జెట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర ప్రొడక్షన్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వరుసగా 10కి పైగా సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాళ్ళు ఆర్థికంగా ఎలా మ్యానేజ్ చేస్తున్నారో ఏమో గాని ఒక దగ్గర సక్సెస్ రాగానే వెంటనే మరో సినిమాపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక కంటెంట్ నచ్చితే చాలు హీరో మార్కెట్ ను కూడా లెక్క చేయడం లేదు.

పరిధికి మించి బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఇక తొలిసారిగా కళ్యాణ్ రామ్ సినిమాపై కూడా ఎవరు ఊహించని విధంగా ఖర్చు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ఏకంగా 60కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇంతవరకు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనీసం 25కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేదు. అలాంటిది మొదటి సారి అతని సినిమాకి బడ్జెట్ లిమిట్స్ లేకుండా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారట. పైగా దర్శకుడు కూడా కొత్తవాడే. మైత్రికి అగ్ర దర్శకులతో ఉన్న సాన్నిహిత్యం అలాగే అనుభవం ప్రకారం ఇప్పటివరకు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. మరి కళ్యాణ్ రామ్ 19వ సినిమాను వాళ్ళు విధంగా నమ్మారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.