‘వెంకీమామ’ రిలీజ్ డేట్ ఇచ్చారు సరే.. కానీ?

ఇప్పుడు స్నేహితుల మధ్య సినిమా టాపిక్ ల గురించి డిస్కషన్లు చేసుకుంటే.. కచ్చితంగా ‘వెంకీమామ’ సినిమా గురించి కాస్త ఎక్కువ డిస్కషన్లే అవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కాబట్టి. ‘పవర్’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ‘జై లవ కుశ’ వంటి చిత్రాలని తెరకెక్కించిన కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం.. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ వంటి భామలు హీరోయిన్లుగా నటిస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.

Venky Mama Movie Release Date Fixed1

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకి.. డిసెంబర్ 13నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. అంటే ఇక విడుదలకు కేవలం 11 రోజులు మాత్రమే టైం ఉంది. ఇప్పటికే పాటలు విడుదల చేసి.. టీజర్ లతో కూడా అందరి అటెన్షన్ డ్రా చేశారు కాబట్టి పెద్దగా ప్రాబ్లెమ్ లేదు. కానీ డిసెంబర్ 20 న కూడా బాలయ్య ‘రూలర్’, సాయి తేజ్ ల ‘ప్రతీ రోజు పండగే’ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి పోటీని తట్టుకోవాలి అంటే కాస్త ఎక్కువ ప్రమోషన్లు చెయ్యాల్సి ఉంటుంది. అందులోనూ విడుదల రోజు తీసేస్తే కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నట్టు. మరి ఈ కాస్త టైములో అంత పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తారా అన్నది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.