బిగ్ బాస్ 3 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్3’ విజయవంతంగా 9 వ వారంలోకి అడుగుపెట్టింది. 5,6 వారాలు కాస్త నీరసంగా సాగినప్పటికీ 7 వ వారం నుండీ మళ్ళీ ఊపందుకుంది. అలీ రెజా వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులకి పెద్ద ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీ శిల్పా చక్రవర్తి కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ వారం నామినేషన్స్ లో రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, హిమజ రెడ్డి ఉన్నారు.

himaja-will-be-eliminated-this-weekend1

వీరి ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని గెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ముగ్గురూ పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు కాదు.. అలా అని వీక్ కంటెస్టెంట్ లు కూడా కాదు. ఈ క్రమంలో ఎవరికి ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేస్తారు అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఎక్కువ ఓట్లు రాహుల్ కు పడ్డాయట. చాలా వరకూ రాహుల్ సేఫ్ అయిపోయినట్టే. ఇక తరువాత మహేష్, హిమజ లకు సమానంగా ఓట్లు పడినప్పటికీ… అటుతరువాత మహేష్ ఎక్కువ ఓట్లతో లీడింగ్ లోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే హిమజ డేంజర్ జోన్ లో ఉందట. ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్సులు ఎక్కువ శాతం హిమజకే ఉన్నట్టు స్పష్టం అవుతుంది. అయితే శుక్రవారం నైట్ లోపు ఏమైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.