‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

2018 లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి'(సిరీస్) తరువాత పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన చిత్రం ఇదే..! సాధారణంగా కన్నడ చిత్రాలు చాలా వరకూ రీమేక్ లే ఉంటాయనే ఉద్దేశంతో ప్రేక్షకులు వారి చిత్రాలను పెద్దగా పట్టించుకోరు అనేది వాస్తవం. అయితే ‘కె.జి.ఎఫ్’ చిత్రం చూస్తున్నంత సేపు ఇది పరభాషా చిత్రం అనే ఫీలింగ్ రాదు.

హీరో యష్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి అక్టోబర్ 23నే ‘కె.జి.ఎఫ్2’ ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల కుదరలేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ పార్ట్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు.

2021 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలుస్తాయని ఇన్సైడ్ టాక్. ‘బాహుబలి’ ‘సాహో’ స్థాయిలో.. ‘కె.జి.ఎఫ్2’ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.