భార్యను లేడీ బాస్ అంటున్న మహేష్ : ప్రభుదేవాతో కాజల్ రొమాన్స్ : ‘క్రాక్’ డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్

ఈరోజు మహేష్ బాబు భార్య నమ్రత 49వ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తన భార్యకు వైరైటీగా విషెస్ చెప్పాడు మహేష్ బాబు. ‘ఈరోజు నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు. ప్రతిరోజు నీతో గడపడం నాకు స్పెషల్ గా ఉంటుంది..అయితే నాకు ఈ రోజు మరింత స్పెషల్. హ్యాపీ బర్త్ డే లేడీ బాస్’ అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం వీరు దుబాయ్ లో ఉన్నారు. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

పెళ్ళైన తరువాత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్. తాజాగా ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి కాజల్ ఓకే చెప్పిందట. కళ్యాణ్‌ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.ప్రస్తుతం ‘ఆచార్య’ ‘ఇండియన్2’ వంటి బడా చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది కాజల్. ఇక విష్ణుతో కలిసి నటించిన ‘మోసగాళ్ళు’ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనున్నట్టు గత కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘మైత్రీ మూవీ మేకర్స్’‌ బ్యానర్‌ పై ఈ చిత్రం రూపొందే అవకాశాలు ఉన్నాయని.. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని దర్శకుడు గోపీచంద్ మలినేని‌ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం ఉండబోతుందని కూడా తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.