ఈమధ్యకాలంలో ఒక సినిమాలో అన్ని ఫైట్స్ రాలేదేమో

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. “సైరా నరసింహా రెడ్డి” సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఆడియో వేడుకను కర్నూల్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అనంతరం తమిళ, మలయాళ, హిందీ వెర్షన్స్ కి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్స్ ను కూడా నిర్వహించేందుకు టీం సన్నద్ధమవుతోంది. మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాక.. యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

characters-in-sye-raa-movie

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తం 10 ఫైట్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా సినిమాల్లో ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటేనే ఆడియన్స్ వెర్రెత్తిపోతుంటారు. అలాంటిది ఏకంగా 10 యాక్షన్ బ్లాక్స్ అంటే మాస్ జనాలకు పండగే. మెగాస్టార్ 151వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా కథానాయికలుగా నటించగా.. అనుష్క, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Share.