ఇద్ద‌రి భ‌విష్య‌త్తు తేల్చ‌నున్న సినిమా.. తేడా కొడితే స‌ర్ధుకోవాల్సిందే..!

మంచు విష్ణు, శ్రీను వైట్ల మ‌రోసారి క‌లుస్తారా అని సినీ ప్రియుల్లో ఉన్న స‌స్పెన్స్‌కి తెర‌ప‌డింది. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చి సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. విష్ణు జన్మదినాన్ని పురస్కరించుకుని డి & డి టైటిల్‌ను ప్ర‌క‌టించారు. 13 ఏళ్ళ క్రితం శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఢీ సినిమా కామెడీ ఎంట‌ర్ టైనర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ వ‌స్తుందంటూ, కొన్నాళ్ళుగా సినీ స‌ర్కిల్స్ అండ్ సోష‌ల్ మీడియ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డే రోజు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని హింట్ కూడా ఇచ్చాడు. చెప్పిన‌ట్లే ఈరోజు ఢీ మూవీకి సీక్వెల్‌గా డి & డి ట్యాగ్‌లైన్ డబుల్ డోస్ అంటూ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అభిమానుకు మంచి కిక్ ఇచ్చాడు. టైటిల్ చూస్తుంటే ఈ మూవీలో డ‌బుల్ ఫ‌న్ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఢీ మూవీలో సునీల్, బ్ర‌హ్మానందం, శ్రీహ‌రి, జ‌య‌ప్రకాష్‌ల పాత్ర‌లు హైలెట్‌గా ఉంటాయి. ఈ న‌లుగురు త‌మ‌దైన టైమింగ్‌తో ప్రేక్ష‌కుల క‌డుపులు చెక్కలు అయ్యేలా హిలేరియ‌స్‌గా న‌వ్వించారు.

అయితే ఇప్పుడు దివంగ‌త న‌టులు శ్రీహ‌రి, జ‌య‌ప్ర‌కాష్‌లు ఇద్ద‌రు ఈ లోకాన్ని వీడారు. ఈ సీక్వెల్‌లో వారి క్యారెక్ట‌ర్స్ కంటిన్యూ అవుతాయా.. అయితే వారి ప్రాత్ర‌ల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రు అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇకపోతే అంత‌కంటే ముఖ్య‌మైన విష‌యం సీక్వెల్ అంటే గ‌త చిత్రంలో పోలిక‌లు వ‌స్తాయి. ఒరిజిన‌ల్ మూవీ హిట్ అవ‌డంతో, దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న చిత్రం పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఉంటాయి. కాస్త తేడా కొట్టినా రిజ‌ల్ట్ రివ‌ర్స్ అయిపోతుంది.

Manchu Vishnu shocks everyone with his decision1

ఒక‌వైపు శ్రీను వైట్ల, మ‌రోవైపు విష్ణు ఇద్ద‌రికి భ‌విష్య‌త్తు ప‌రంగా చాలా కీల‌కం. శ్రీను డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన గ‌త చిత్రాలు బాక్సీఫీస్ వ‌ద్ద ఘోరంగా డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఇక విష్ణుకి హిట్ వ‌చ్చి పుష్క‌ర కాల‌మే అయ్యింది. విష్ణు సినిమాలు థియేట‌ర్స్‌కి ఎప్పుడు వ‌చ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియ‌దు. దీంతో వ‌రుస ప్లాప్స్‌తో గాడి త‌ప్పిన వీరి కెరీర్లు గాడిన ప‌డాలంటే, ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాలి. తాడో పేడో తేల్చుకోవాల్సిన సిట్యువేష‌న్‌లో ఈ ఇద్ద‌రు విజ‌యం సాధిస్తారా లేక గ‌త చిత్రాల వ‌లె నిరాశ‌ప‌ర్చి స‌ర్ధుకుంటారా అనేది చూడాలి. ‌

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.