మహేష్- తమన్ కాంబో ఈసారి హిట్టు కొడతారా?

ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ కు తమన్,మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ హీరోలు చేస్తున్న తరువాతి సినిమాలు అయిన ‘పుష్ప’ కు దేవి శ్రీ ప్రసాద్, ‘ సర్కారు వారి పాట’ కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్ దర్శకుడు కాబట్టి.. అందులోనూ దేవి అతనికి అత్యంత సన్నిహితుడు కాబట్టి.. కచ్చితంగా మంచి మ్యూజిక్ రాబట్టుకుంటాడు.

అయితే ‘సర్కారు వారి పాట’ చిత్రానికి పరశురామ్(బుజ్జి) .. తమన్ నుండీ మంచి సంగీతం రాబట్టుకుంటాడా..? అనేది పెద్ద ప్రశ్న. ఈ మధ్యకాలంలో తమన్ మంచి పాటలు అందిస్తున్నాడు. కానీ ఆల్బమ్ మొత్తం హిట్ అయ్యింది ‘అల వైకుంఠపురములో’ చిత్రం మాత్రమే..! ఇక దర్శకుడు పరశురామ్ గత చిత్రాలు ‘ఆంజనేయులు’ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. కానీ గుర్తుంచుకునేంత గొప్ప పాటలు మాత్రం ఇవ్వలేదు. మరి ఈ సారి మహేష్ తో సినిమా కాబట్టి.. అభిమానులు తమన్ నుండీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు.

Thaman With Mahesh Babu

అయితే తమన్ గతంలో మహేష్ తో ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ ‘ఆగడు’ చిత్రాలకు పనిచేసాడు. ‘ఆగడు’ ఆడియో పెద్దగా హిట్ అవ్వలేదు. అయినా సరే తమన్ కు ఇప్పుడున్న ట్రాక్ రికార్డు చూసి… మహేష్ నాలుగోసారి అవకాశం ఇచ్చాడు. మరి ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.! నిజానికి ‘సర్కారు వారి పాట’ చిత్రానికి ముందుగా గోపి సుందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలి అనుకున్నారట. కానీ మహేష్ మాత్రం ఏరి కోరి తమన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.