సుధీర్ బాబుకి శ్రీదేవి దొరికేసింది..!

‘ప‌లాస 1978’ చిత్రంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌.థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎక్కువ మంది చూడకపోయినప్పటికీ.. ఓటిటిలో మాత్రం చాలా మంది చూసారు. ఇప్పుడు ఎక్కడ విన్నా… ‘నక్కిలీసు గొలుసు’ పాటే..! యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికే చాలా రికార్డులను కొల్లగొట్టింది. 1978 లో ‘పలాస’ లోని కొందరి జీవన శైలి ఎలా ఉండేది అనే అంశాన్ని చాలా రియాలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు కరుణ కుమార్.

ఇప్పుడు అతను రెండో చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు.‘శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌’ పేరుతో ఈ చిత్రం తెర‌కెక్కబోతుంది.ఇలాంటి కొత్త సినిమాలు చెయ్యడానికి హీరో సుధీర్ బాబు ఎప్పుడూ ముందుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో అతనే హీరో. ఈ మధ్యనే మోషన్ పోస్టర్ ను కూడా విడుద‌ల చేశారు.దానికి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా 1980 నేప‌థ్యంలో సాగే క‌థే అని ఆ మోషన్ పోస్టర్ ను బట్టి స్పష్టమవుతుంది.

సుధీర్ బాబు ఈ చిత్రంలో లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే శ్రీ‌దేవిగా ఎవరు కనిపిస్తున్నారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. నిజానికి ఈ పాత్ర కోసం కొత్త హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఫైనల్ గా ‘పలాస’ హీరోయిన్ న‌క్ష‌త్రనే ఫైనల్ చేసారని సమాచారం‌. `ప‌లాస‌` చిత్రంలో ఆమె కూడా అద్భుతంగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. కాబట్టి ఆమె ఈ చిత్రానికి మంచి సెలక్షన్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Share.