హిందీ ‘ఛత్రపతి’ కి హీరోయిన్ ను ఫిక్స్ చేశారట..!

ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ప్ర‌భాస్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘ఛ‌త్ర‌ప‌తి’.. ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ను కంప్లీట్ మాస్ హీరోని చేసిన చిత్రమిది. ఇందులో ప్రభాస్ లుక్స్ మరియు అతని చేసిన యాక్షన్ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యబోతున్న సంగ‌తి తెలిసిందే.ఈ చిత్రంతో బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు మరియు టాలీవుడ్ క్రేజీ హీరో అయిన సాయి శ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

వి.వి.వినాయ‌క్ అక్కడ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యబోతున్నారు. ఆయనకు కూడా ఇది డెబ్యూనే అనుకోవాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు ఎంపికయ్యారు అనే విషయం పై సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతుంది. అలియా భట్, శ్ర‌ద్దా క‌పూర్‌, కైరా అద్వానీ,దీపికా పడుకొనే… వంటి స్టార్ హీరోయిన్లు శ్రీనివాస్ తో నటించడానికి నిరాకరించారు అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. దిశా ప‌టానీ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

పూరి జ‌గ‌న్నాథ్ తెరకెక్కించిన `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్లో బిజీ అయిపోయింది‌. అందుకే ఈమెని ఎంపిక చేసుకుంటే ‘హిందీ’ ఛత్రపతికి క్రేజ్ కూడా ఏర్పడుతుందని ఈమెను ఫైనల్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం కోసం భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసిందని టాక్.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.