మిస్కిన్ తప్పుకోవడంతో మెగాఫోన్ పట్టనున్న విశాల్

నటుడు విశాల్‌ హీరోగా డైరెక్టర్ మిస్కిన్‌ దర్శకత్వంలో “తుప్పరివాలన్‌” సినిమా వచ్చింది. తెలుగులో “డిటెక్టివ్‌”గా విడుదలైంది. రెండు భాషల ప్రేక్షకులనూ సినిమా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా “తుప్పరివాలన్‌ 2” చేస్తున్నారు. ఇందులోనూ హీరోగా విశాల్‌, అతడి స్నేహితుడిగా ప్రసన్న నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తయింది.

Hero Vishal turned as director1

అయితే.. బడ్జెట్‌, ఇతర విషయాల్లో హీరో, దర్శకుడి మధ్య గొడవలు అయ్యాయట. దాంతో సినిమా నుండి మిస్కిన్‌ తప్పుకున్నాడని సమాచారం. దాంతో మిగతా సినిమాను తన దర్శకత్వంలో పూర్తి చేయాలని విశాల్‌ నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో చిత్రబృందం నుండి ఎటువంటి సమాచారం లేదు. మరి దర్శకుడిగా విశాల్ ఆడియన్స్ ను ఏమేఏరకు మెప్పించగలుగుతాడో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.