విశాల్ గాయాలపాలవ్వడానికి అసలు కారణం బన్నీ?

మాస్ చిత్రాలకి హీరోల డ్యాన్స్ లు కూడా అడ్వాంటేజ్ అవుతుంటాయి. కమర్షియల్ సినిమాకి… మంచి మాస్ బీట్ సాంగ్ ఒకటి ఉంటే… అదే పాటకి మన అభిమాన హీరో చిందేస్తుంటే థియేటర్ లో కూర్చునే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. ఇందుకోసమే పెద్ద హీరోలు డ్యాన్స్… వచ్చినా రాకపోయినా కొన్ని స్టెప్పుల కోసం చాలా కష్టపడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు హీరోలు గాయాలపాలవుతారు. గతంలో అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ చిత్రం కోసం ఓ సాంగ్ కి వేసిన స్టెప్పులు… ఆయన సర్జరీ చేయించుకునేంత వరకూ వెళ్ళాయి. పాపం ఇప్పుడు విశాల్ కి కూడా ఇదే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం విశాల్ ‘టెంపర్’ రీమేక్ అయిన ‘అయోగ్య’ చిత్రంలో నటిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే… ఈ చిత్రంలో అల్లు అర్జున్ – బోయపాటి ల సూపర్ హిట్ ‘సరైనోడు’ చిత్రంలోని ‘బ్లాక్ బస్టర్’ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంచి మాస్ పాట… అందులోనూ డ్యాన్స్ కి స్కోప్ ఉన్న పాట కావడంతో విశాల్ కూడా కష్టమైన స్టెప్స్ వేయడానికి రెడీ అయ్యాడు. అయితే దురదృష్ట వశాత్తు గాయాలపాలయ్యాడట. మోచేయి వాయడంతో పాటు కాలికి కూడా గాయమయిందని తెలుస్తుంది. దీంతో ఈ పాట చిత్రీకరణ నిలిచిపోయిందట. విశాల్ కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక విశాల్ కి జోడీగా రాశిఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని విశాల్, జ్ఞానవేల్ రాజా కలిసి నిర్మిస్తున్నారు.

Share.