హైద్రాబాద్ లో జరిగిన విశాల్-అనీషా ఎంగేజ్ మెంట్

విశాల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికంటే.. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిపినప్పుడే ఎక్కువ ప్రచారం సంపాదించాడు. ఈ ఇద్దరికీ త్వరలోనే పెళ్లి అని కూడా గుసగుసలు వినిపించాయి. వరలక్ష్మి కూడా రెండు మూడుసార్లు ఇండైరెక్ట్ గా తాను విశాల్ ప్రేమలో ఉన్నానని చెప్పింది. నిజానికి వరలక్ష్మి వెండితెర తెరంగేట్రం జరిగింది కూడా విశాల్ సినిమా ద్వారానే. అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు.

hero-vishal-got-engaged1

hero-vishal-got-engaged2

కట్ చేస్తే.. ఇదిగో ఈమే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని విశాల్ వరలక్ష్మిని కాకుండా వేరే అమ్మాయిని ప్రకటించేసరికి వరలక్ష్మి షాక్ అయ్యిందో లేదో తెలియదు కానీ.. తమిళ, తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రం కాస్త గట్టిగానే షాక్ అయ్యారు. విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనీషా రెడ్డి కూడా నటి కావడం విశేషం, విజయ్ దేవరకొండ నటించిన “పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి” చిత్రాల్లో అనీషా క్యారెక్టర్ రోల్స్ ప్లే చేసింది. ఈ ఇద్దరికీ నేడు హైద్రాబాద్ లో ఎంగేజ్ మెంట్ జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు కానీ.. విశాల్ పెళ్లికొడుకవ్వడానికి పెద్దగా టైమ్ లేదని మాత్రం తెలుస్తోంది.

hero-vishal-got-engaged3

Share.