అభిమాని కోసం స్టేజ్ దిగి వచ్చిన సూర్య

ఆయన వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాడో.. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలోనూ అంతే హుందాగా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. “ఎన్ జి కె” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఇద్దరు పిల్లలు సెల్ఫీ అడిగారని స్పీచ్ ఆపి మరీ వాళ్ళకు సెల్ఫీ ఇచ్చిన సూర్య.. నిన్న జరిగిన “బందోబస్త్” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒక లేడీ ఫ్యాన్ ఆయన కోసం ప్రత్యేకంగా ఈవెంట్ కు వచ్చిందని తెలుసుకొని.. ఆమె దగ్గరకు వచ్చి మరీ ఆమెను విష్ చేయడమే కాక ఫోటోలు కూడా దిగి.. వాళ్ళకి బెస్ట్ మూమెంట్ ను ఇచ్చాడు. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే.. సూర్యను ఆయన అభిమానులు ఎప్పుడు హిట్టు/ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆదరిస్తారు.

hero-suriya-came-down-met-the-couple1

ఇకపోతే.. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా.. మోహన్ లాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “బందోబస్త్” వచ్చే వారం విడుదలవుతుండగా.. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు మాత్రం లేవు. అందుకు కారణం సినిమా ట్రైలర్ కానీ, పాటలు కానీ క్లిక్ అవ్వకపోవడమే. మరి సినిమా అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుందో లేదో చూడాలి. ఈ సినిమా హిట్ అవ్వడం సూర్య కెరీర్ కు చాలా కీలకం.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.