అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి.. హీరో ట్వీట్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. చివర్లో ముఖ్య అతిథికి ఫస్ట్ డే ఫస్ట్ షో బిగ్ టికెట్ ని ఇచ్చారు. ఈ బిగ్ టికెట్ కు ఉన్న కవర్ ను త్రివిక్రమ్ ఓపెన్ చేయగానే.. అందరూ ఆశ్చర్యపడ్డారు.

ఎందుకంటే అది ‘క్రాక్’ సినిమా టికెట్. జనవరి 9వ తేదీతో టికెట్ ఉంది. తప్పుని గ్రహించిన ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా అదే టికెట్ పై ‘రెడ్’ సినిమా స్టిక్కర్ ను అతికించి ఇచ్చింది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఆ మాత్రం చూసుకోలేరా..? అంటూ అభిమానులు మండిపడ్డారు. మరికొందరు ‘క్రాక్’ సినిమాకి ఫ్రీ ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పై స్పందించిన హీరో రామ్ ఒక ట్వీట్ చేశారు. ఈవెంట్ ని మరపురాని జ్ఞాపకంగా మార్చినందుకు త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు చెప్పారు.

అభిమానులకు, మీడియాకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. చివరగా శ్రేయాస్ మీడియాను ఉద్దేశిస్తూ.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి.. ఏం పర్వాలేదు.. ఇప్పటికీ మీరే బెస్ట్ అంటూ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన శ్రేయాస్ శ్రీనివాస్.. ‘రెడ్’ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. మీరు అమేజింగ్ హీరో మాత్రమే కాదు… అందరినీ ప్రేమించే వ్యక్తి కూడా అంటూ రామ్ పై ప్రేమ కురిపించారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.