హీరో రామ్ వేదాంతం విన్నారా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి పీటలు ఎక్కి వార్తల్లో నిలిచారు. రానా, నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు. దీంతో మిగిలిన కుర్ర హీరోలకు కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన సమాధానాలు వాళ్లు చెబుతూ పెళ్లి టాపిక్ ని సైడ్ చేసేస్తున్నారు. తాజాగా హీరో రామ్ కూడా తన పెళ్లిపై కామెంట్స్ చేశారు.

రామ్ నటించిన ‘రెడ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన రామ్ కి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి రామ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పట్లో పెళ్లి ఉండదని చెబుతూనే.. పెళ్లి గురించి వేదాంతం మాట్లాడాడు. ”పెళ్లి మన చేతిలో ఉండదు.. పెళ్లి తరువాత ఏదీ మన చేతిలో ఉండదు” అంటూ పెళ్లిపై తన ఒపీనియన్ చెప్పుకొచ్చాడు. తనకు సక్సెస్ రావడానికి సమయం పెట్టినట్లే.. పెళ్లికి కూడా ఓ టైమ్ ఉంటుందని.. ఆ టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చాడు రామ్.

అలానే పాన్ ఇండియా సినిమాపై కూడా స్పందించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో రామ్ కి కూడా అలాంటి ఆలోచన ఉందా..? అని ప్రశ్నించగా.. తను కూడా ఓ పాన్ ఇండియా సినిమా కోసం ఎదురుచూస్తున్నానని.. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మంచి పాయింట్ ఏదైనా దొరికితే.. పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.