వైరలవుతున్న రాజ్ తరుణ్ విజువల్స్… అసలు మ్యాటర్?

తాజాగా నార్సింగ్ సమీపంలో అల్కాపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇది హీరో తరుణ్ కారని సోషల్ మీడియాలోనూ, టీవీల్లోనూ ప్రచారం జరగడంతో… స్వయంగా తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ‘నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు.. నా కారు క్షేమంగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ కారులో ఉన్నది ఎవరు అని అందరూ అనుకుంటుండగా… ఓ సిసి ఫుటేజ్ ద్వారా అది తరుణ్ కాదు రాజ్ తరుణ్ అని పోలీసులు తేల్చేసారు. పేర్లు ఒకటే కావడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడిందని తెలుస్తుంది.

hero-raj-tarun-escaped-from-car-incident1

రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుండీ బయటపడ్డాడు. ఆయన కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్‌ అనంతరం రాజ్ తరుణ్ రోడ్డు పై పరుగెడుతున్నదృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అనంతరం రాజ్ తరుణ్ వేరే కారులో వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేదాని పై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కారుని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్ళడం పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరి రాజ్ తరుణ్ స్వయంగా నోరు విప్పితే తప్ప విషయం ఏంటనే క్లారిటీ వచ్చేలా లేదు..!

Share.