కమర్షియల్ కెరీర్ ను స్టార్ట్ చేసిన నితిన్..!

ఈ లాక్ డౌన్ టైములో బాగా ఫేమస్ అయిన వాళ్ళ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది నటి ప్రగతి. సోషల్ మీడియాలో ప్రగతి ఆంటీగా పాపులర్ అవుతున్న ఈ నటి.. లాక్ డౌన్ మొత్తం రకరకాల పాటలకు డ్యాన్స్ లు .. అలాగే జిమ్ వర్కౌట్ వీడియోలతో తెగ సందడి చేసింది. ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా..! సినిమాల్లో అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తూ వచ్చిన ప్రగతిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. అయితే ‘తనకు ఇలా ఉండడమే ఇష్టమని..

కేవలం కొన్ని పాత్రలకే పరిమితమైపోవాలి అని అస్సలు అనుకోవడం లేదని.. ఛాన్స్ వస్తే నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా రెడీ అని’ ప్రగతి తెలిపింది. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రగతి.. నితిన్ తో కలిసి తెగ హంగామా చేసిందంటే నమ్మండి..! విషయం ఏమిటంటే.. ఈ మధ్యనే నితిన్ కూడా తన కమర్షియల్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని నితినే కొద్దిరోజుల క్రితం కొన్ని ఫోటో షూట్ల ద్వారా తెలియజేసాడు.‌మొదటి ప్రయత్నంగా హైదరాబాద్‌కు చెందిన ‘స్నేహా చికెన్’ బ్రాండ్‌ ను ప్రమోట్ చేస్తున్నాడు నితిన్.

దానికి సంబంధించిన మొదటి వీడియో ఈరోజు విడుదల అయ్యింది. ఇక ఇందులో నితిన్‌ తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపించడం విశేషం.‘ఈ అమ్మలెప్పుడూ ఇంతేనండీ. మనం ఎక్కడున్నా ఒక్కటే ప్రశ్న. తిన్నావా? అని. ఆ ప్రశ్నకు సమాధానం ‘స్నేహా చికెన్’ అయితే ప్రతి అమ్మకి పండగే’ అంటూ నితిన్ ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేసాడు. అయితే ప్రగతి ఈ యాడ్ కు డబ్బింగ్ చెప్పకపోవడం మనం గమనించవచ్చు.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.