నాని ని పక్కకు నెట్టేస్తున్న మెగా ప్రిన్స్…!

పాపం నానికి ఈ మధ్య అస్సలు టైం కలిసి రావడం లేదు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ దగ్గర్నుండీ ‘ఎం.సి.ఏ’ వరకూ ఈ నేచురల్ స్టార్ కు ప్లాపులు లేవు. కానీ గతేడాది వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా నుండీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడం.. ఆ తరువాత వచ్చిన ‘దేవదాస్’ కూడా ‘కౌశల్ ఆర్మీ’ ఎఫెక్ట్ వల్ల ప్లాప్ అయ్యింది. కచ్చితంగా నాని పెద్ద స్టార్ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నాని గ్రాఫ్ పడిపోయింది.

Hero Nani With Varun Tej

ఇప్పటికే విజయ్ దేవరకొండ.. నాని కంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నాని ని మించిపోయాడని తెలుస్తుంది. ‘ఎఫ్2’ ‘గద్దలకొండ గణేష్’ వంటి వరుస హిట్లతో ఇప్పుడు వరుణ్ 10 కోట్ల వరకూ రేమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. విజయ్ ఇప్పటికే 10 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుండగా ఆ తరువాత నాని 8 కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకూ 6 కోట్లు తీసుకుంటూ వచ్చిన వరుణ్ కూడా 10 కోట్లు తీసుకుంటున్నాడట. ముందుగా నాని కోసం స్క్రిప్ట్ లు రాసుకున్న దర్శకులు ఇప్పుడు అవే స్క్రిప్ట్ లను తీసుకుని వరుణ్ వద్దకు వెళ్తున్నారట. ఇలా వరుణ్ .. నానికి సమస్యగా మారాడు. ఇక నాని కూడా సేఫ్ గేమ్ లు ఆడటం మానేసి … కొత్తగా అందులోనూ స్పీడ్ తో ప్రయత్నిస్తే బెటరేమో..! సరైన స్క్రిప్ట్ పాడాలే కానీ… నాని తన ట్యాలంట్ తో మ్యాజిక్ చేయడం ఖాయం.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.