ఈసారి డెబ్యూ డైరెక్టర్ కి ఫిక్స్ అయిన నాని..!

గత ఏడాది నానికి అంతగా కలిసి రాలేదు. ఆయన చేసిన జర్సీ, గ్యాంగ్ లీడర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. జెర్సీ కొంచెం పరవాలేదు అనిపించినా, గ్యాంగ్ లీడర్ కేవలం యావరేజ్ కలెక్షన్స్ తో ముగించింది. విజయాల సంగతి ఎలా ఉన్నా సినిమాల ప్రకటన విషయంలో నాని జోరుమీదున్నాడు. ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీకాంత్ ఓడెల దర్శకుడిగా పరిచయమవుతూ ఓ చిత్రం తెరకెక్కుతుండగా ఆ మూవీలో హీరోగా నాని నటిస్తున్నాడట.

నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గతంలో పడి పడి లేచే మనసు చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ప్రస్తుతం రానా, సాయి పల్లవి జంటగా విరాట పర్వం మూవీ నిర్మాతగా ఉన్నారు. మరి ఈ చిత్రంలో మిగతా నటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ వి విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ అనంతరం థియేటర్స్ లో దిగనుంది.

Hero nani to announce a new movie1

మరో హీరో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించగా నివేతా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీశ్ అనే చిత్రం చేస్తుండగా, చిత్రీకరణ జరుపుకుంటుంది. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని సమాచారం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.