ఆ ఇండస్ట్రీకి వెళ్లే ఉద్దేశమే లేదంటున్న నాని

13 సంవత్సరాల సినీ కెరీర్ లో 25 సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించారు నాని. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే చిన్న సినిమాలను నిర్మిస్తున్న నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటుడైన నాని వైవిధ్యమైన కథాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సినిమాల్లో ఎంతో నేచురల్ గా నటించే నానిని అభిమానులు ప్రేమగా నేచురల్ స్టార్ అని పిలుచుకుంటారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళతారా..? అనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు నాని సమాధానంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైఫ్ లాంగ్ తాను తెలుగు సినిమాలలో మాత్రమే నటిస్తానని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని నాని తెలిపారు. సినిమా సక్సెస్ సాధించినా, సాధించకపోయినా తెలుగుకే పరిమితం అవుతానని నాని వెల్లడించారు.

అయితే నాని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లకపోయినా పాన్ ఇండియా సినిమాల్లో మాత్రం నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నాని ప్రస్తుతం నటిస్తున్న టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. టక్ జగదీష్ సినిమాకు శివ నిర్వాణ డైరెక్షన్ చేస్తుండగా శ్యామ్ సింగరాయ్ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

గతేడాది వి సినిమాతో అభిమానులను నిరాశపరిచిన నాని టక్ జగదీష్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని ఆశిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారారు. ప్రస్తుతం ఈ హీరో సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.