అజిత్, మహేష్.. దెబ్బకు కనుమరుగైన బాలీవుడ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే సోషల్ మీడియాలో ఏ రేంజ్ హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ ఏడాది మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సమ్మర్ కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. వంశీపైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్,పీవీపీ కలిసి నిర్మించారు. మహేష్ బాబు కెరీర్లోనే ‘మహర్షి’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

hero-ajith-kumar-and-mahesh-babu-stood-in-top-position1

ఇదిలా ఉండగా ‘మహర్షి’ చిత్రం ఇప్పుడు ఓ అరుదైన ఘనతను సాధించింది. అదేంటంటే.. ఈ సంవత్సరం జూన్ నెల వరకు విడుదలైన సినిమాల్లో ఇండియాలో అత్యధికంగా ట్రెండింగ్ లో నిలిచిన ట్విటర్ హ్యాష్ ట్యాగ్ లలో ‘మహర్షి’ 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక మొదటి స్థానంలో అజిత్ ‘విశ్వాసం’ చిత్రం నిలిచింది. ఇక రెండవ స్థానంలో ‘లోక్ సభ ఎలక్షన్స్ 2019’ హ్యాష్ ట్యాగ్, మూడవస్థానంలో ‘క్రికెట్ వరల్డ్ కప్ 2019, ఐదవస్థానంలో ‘న్యూ ప్రొఫైల్ పిక్’ హ్యాష్ ట్యాగ్స్ నిలిచాయి. ఇక మొదటి ఐదు స్థానాల్లో ఒక్క బాలీవుడ్ చిత్రం కూడా లేకపోవడం గమనార్హం. ఏమైనా సౌత్ హీరోల సినిమాల స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ అయ్యింది.

Share.