అబ్బాస్.. సినిమాలు వదిలెయ్యడానికి కారణం అదేనట..!

మీర్జా అబ్బాస్ అలీ.. ఇలా చెప్తే ఎవ్వరికీ అర్ధం కాదేమో.. అదే హీరో అబ్బాస్ అనగానే అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ‘ప్రేమదేశం’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్.. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 1996 లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇతను చాలా గ్లామర్ గా ఉండడంతో.. లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉండేవారు. తమిళ్ తో పాటు తెలుగు,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో కలిపి.. అబ్బాస్ 60కి పైగా సినిమాల్లో నటించాడు.

అయితే 2016 తరువాత అబ్బాస్ సినిమాల్లో కనిపించలేదు. అయితే హార్పిక్ యాడ్ ద్వారా మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు నేనున్నాను అని గుర్తుచేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆ యాడ్ ను బోలెడన్ని మీమ్స్ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు ట్రోలర్స్. అబ్బాస్ చివరిగా ఓ మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసాడు.దానికి గల కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియలేదు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. ఇటీవల ఓ సందర్భంలో అతను సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నది తెలియజేసాడు.

‘సినిమాల్లో నటించడం నాకు చాలా బోర్ కొట్టేసింది. అందుకే నటనకు గుడ్ బై చెప్పేసాను. మనసు లగ్నం చేయలేనప్పుడు నటనకు న్యాయం చెయ్యలేను అనిపించింది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.