పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ రీమేక్ చేసిన 11 సినిమాల లిస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినబడితే చాలు ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత వినబడుతుంది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు. చేసిన మొదటి 7 సినిమాల్లో 6 హిట్లందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. ఆయన సినిమాలు ఎన్ని రికార్డులు కొల్లగొట్టినా.. ఎటువంటి హడావిడి చేయకుండా.. అస్సలు వాటితో సంబంధమే లేనట్టుగా చాలా సింపుల్ గా ఉంటారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

అయితే ఆయన సినిమాలకు చెయ్యను అని ప్రకటించినప్పుడు.. ఆయన అభిమానులు ఎంతో నిరాశకు లోనయ్యారు. ‘అన్నా.. నీ సినిమాలు ప్లాప్ అయినా పర్వాలేదు.. కానీ నువ్వు సినిమాలు మాత్రం చేయడం మానొద్దు’ అంటూ ఆయన అభిమానులు ఎంతలా పరితపించిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు.. ఇది రీమేక్. ఇక పవన్ కళ్యాణ్… తన 23 ఏళ్ళ సినిమా కెరీర్లో ఎన్నో రీమేక్ చిత్రాలు చేశారు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గోకులంలో సీత: పవన్ కళ్యాణ్, రాశీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గోకులతిల్ సీతై’ చిత్రానికి ఇది రీమేక్.

2) సుస్వాగతం: పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రీమేక్ లకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఓ క్లాసిక్ అని కూడా చెప్పొచ్చు. ఈ చిత్రం కూడా తమిళ రీమేక్ కావడం విశేషం. అక్కడ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘లవ్ టుడే’ పేరుతో ఈ చిత్రం రూపొందింది.

3) తమ్ముడు: అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ చిత్రం .. ఓ అనఫిషియల్ రీమేక్. హిందీ చిత్రమైన ‘జో జీత ఓహి సికిందర్’ స్ఫూర్తి తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో అమీర్ ఖాన్ హీరో.

4) ఖుషి: పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ అయిన ‘ఖుషి’ కూడా రీమేకే..! ఎస్.జె.సూర్య నే తమిళంలో విజయ్ తో ‘ఖుషి’ గానే ఈ చిత్రాన్ని రూపొందించాడు.

5) అన్నవరం: పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ‘అన్నవరం’ చిత్రాన్ని కూడా భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసాడు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన ‘తిరుపచి’ చిత్రానికి ఇది రీమేక్.

6) తీన్ మార్: పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేసాడు. హిందీలో సూపర్ హిట్ అయిన సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకొనె ల ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి ఇది రీమేక్.

7) గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దబాంగ్’ కు ఇది రీమేక్ కావడం విశేషం.

8) గోపాల గోపాల: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకుడు. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్.

9) కాటమరాయుడు: పవన్ కళ్యాణ్, శృతీ హాసన్ నటించిన ఈ చిత్రానికి కూడా కిశోర్ పార్థసాని (డాలీ) నే దర్శకత్వం వహించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ ‘వీరం’ చిత్రానికి ఇది రీమేక్.

10) అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ఫ్రెంచ్ మూవీ ‘ది లార్గో వించ్’ చిత్రానికి ఇది అనఫిషియల్ రీమేక్.

11) వకీల్ సాబ్ (‘పి.ఎస్.పి.కె 26’ వర్కింగ్ టైటిల్): పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26 వ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. 2020 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Share.