బిగ్ బాస్ 4: సోషల్ మీడియాలో హారిక ఫ్యాన్స్ హల్ చల్..!

బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ని డిసైడ్ చేసే వీక్ వచ్చేసింది. ఫైనల్ 5 మెంబర్స్ లో ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హారిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఓట్ ఫర్ హారిక అంటూ క్యాంపైన్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు హారిక విన్నర్ అవ్వడానికి రీజన్స్ ఇవే అంటూ నెటిజన్స్ పోస్టర్స్ ని షేర్ చేస్తున్నారు.

1. హారిక ఎక్కడా కూడా ఉమెన్ కార్డ్ తీయడం కానీ, సింపతీని వాడటం కానీ చేయలేదు. గేమ్ లో తన ఆట తను ఆడింది.

2. తను గేమ్ ని ఎప్పుడూ కూడా ఇండివెడ్యువల్ గానే ఆడింది. ఎక్కడా కూడా టాస్క్ లలో గేమ్ ని వదల్లేదు. ప్రతి టాస్క్ లోనూ 100 పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చింది.

3. ప్రతి గేమ్ ని మనసు పెట్టి మరీ ఆడింది. స్వచ్ఛంగా గేమ్ స్పిరిట్ తో ఇండిలిజెంట్ గా గేమ్ ని ఆడింది.

4. ఏ హౌస్ మేట్ పైన బురదజల్లే ప్రయత్నం చేయలేదు. వేరేవాళ్లని చెడ్డగా చూపించి తను హైలెట్ అవ్వాలని అనుకోలేదు. హౌస్ మేట్స్ ఎవరినీ మోసం చేయలేదు.

5. వేరే హౌస్ మేట్స్ కి గేమ్ ఆడే స్పేస్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు, గేమ్ లో వాళ్లకి విలువ ఇచ్చింది. అపోజిట్ టీమ్ లో ఉన్నా కూడా వాళ్లపట్ల కేరింగ్ అనేది చూపించింది.

6. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన లేడీస్ లో అందరికంటే కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ గా మారింది. యాక్టీవ్ గా, స్ట్రాంగ్ గా టాస్క్ లలో పార్టిసిపేట్ చేసింది.

7. అందరి హౌస్ మేట్స్ లో స్నేహపూర్వకంగా మెలిగింది. అందర్నీ ఆకట్టుకున్న అమ్మాయిగా నిలిచింది.

8. గేమ్ లో ఎప్పుడూ ఫెయిర్ గా ఉంటూ, తన జెన్యూనిటీని చూపించింది.

9. ఫస్ట్ వీక్ నుంచీ కూడా అందరి పట్ల చాలా కేరింగ్ గా ఉండేది హారిక. హారిక గేమ్ ని ఎలిమినేట్ అయిపోయిన అందరూ కూడా మెచ్చుకున్నారు అంటే, ఆటలో తను ఎంత జెన్యూన్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

10. ఎక్కడా కూడా ముసుగువేసుకుని మాట్లాడలేదు. మాస్క్ వేసుకుని గేమ్ ఆడేందుకు ప్రయత్నించలేదు. ఎలాగైనా సరే టాస్క్ లో గెలవాలని కన్నింగ్ గా గేమ్ ఆడలేదు. అదే హారికకి ప్లస్ పాయింట్ అయ్యింది.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.