సంచలన నిర్ణయం తీసుకున్న సినీ నటి హేమ?

తెలుగు సినిమాల్లో హీరోకి వదినగా, అమ్మగా, పిన్నిగా, అత్త గా అలరిస్తూ వచ్చిన హేమ సినిమాలకి గుడ్ బై చెప్పనుందా? ఆమె మాట్లాడిన మాటల్ని బట్టి ఇది నిజమేనని స్పష్టమవుతుంది. ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్’ లో మెంబెర్ గా కొనసాగుతున్న హేమకి ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు అయితే రావట్లేదు. దీంతో ఆమె దృష్టి రాజకీయాల వైపు మళ్ళినట్టుంది. గతంలో హేమ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ టైములో రాజకీయాలు తనకి సెట్ అవ్వలేదు అనుకుని సినిమాలు చేస్తూ వచ్చింది.

hema-with-jagan

కానీ ఇప్పుడు మాత్రం ఆమె.. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇటీవల రాజమండ్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ…. “నేను రాజమండ్రిలో ఇల్లు కట్టుకున్నాను. హైదరాబాదు సినీ పరిశ్రమను వీడి ఒక అడుగు ముందుకేసి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాను. కాపుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… బడ్జెట్ లో రెండు వేల కోట్లు కేటాయించడం అభినందనీయం. కేంద్రం ప్రకటించిన ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకోవాలి” అంటూ ఆమె హేమ చెప్పుకొచ్చింది.

Share.