ఫారిన్ బోయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్

తమిళ నటుడు విశాల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందనే విషయం ఇంకా కన్ఫర్మ్ అవ్వకముందే.. మరో స్టార్ హీరోయిన్ తాను కొన్నాళ్లుగా తన ఫారిన్ బోయ్ ఫ్రెండ్ తో సాగిస్తున్న రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పేసిన న్యూస్ హల్ చల్ చేయడం మొదలెట్టింది. తెలుగులో కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేసి.. తమిళ, కన్నడ భాషల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించిన దివ్య స్పందన అలియాస్ రమ్య ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రమ్య గత కొంతకాలంగా పోర్చుగల్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకొన్నారు.

have-divya-spandana-and-her-portuguese-boyfriend-raphael-broken-up

కానీ.. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉండి.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మినిస్టర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న రమ్య.. పెళ్లి చేసుకొంటే పోర్చుగల్ రీలోకేట్ అవ్వాల్సి వస్తుందని రిలేషన్ ను బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమె తల్లి కన్ఫర్మ్ చేసింది. మరి రీజన్ ఆదేనా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Share.