అందుకే విజయ్ దేవరకొండ ప్లేస్ లో అదర్వ మురళీ ను తీసుకున్నాడా ?

తాజాగా ‘గద్దలకొండ గణేష్’ చిత్రం తో హిట్ అందుకున్నాడు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన టాలీవుడ్ హీరోల పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ‘ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్.. 8 గంటలకు షూటింగ్ అంటే.. దానికి పది నిమిషాల ముందే వచ్చేస్తారు. తరువాత చిరంజీవి అంటే కింగ్ ఆఫ్ సినిమా .. ఇంకో చిరంజీవి పుడతారని నేను అనుకోనని. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయననటం నాకు నచ్చలేదు.

harish-shankar-vijay-devarakonda-atharvaa

ఇక విజయ్ దేవరకొండ గురించి మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ అయ్యాక… విజయ్ కి కథ చెప్పాలని ఒకసారి కలుద్దామని మెసేజ్ పెట్టాను. డానికి విజయ్… ‘అన్నా.. నేను ఏడాదిన్నర, రెండేళ్ళ వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం’ అని రిప్లై ఇచ్చాడు. సినిమా టాపిక్ కాకపోతే నీతో నాకేం పని ఉంటుందని భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను కూడా రిప్లై ఇచ్చాను. విజయ్ దేవరకొండ విమర్శను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని.. మన పని మనం చేసుకొని వెళిపోతే సరిపోద్ది’ అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ‘గద్దలకొండ గణేష్’ లో అదర్వ మురళి పాత్రకి హరీష్ మొదట విజయ్ దేవరకొండ నే అనుకున్నాడని.. అతను ఆటిట్యూడ్ చూపించడంతో హరీష్ అదర్వ మురళి ను తీసుకున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.