పవన్ కళ్యాణ్ తో ఇంకో సినిమా చేసే అదృష్టం వస్తే ఎందుకు వదులుకొంటాను

జనసేన పార్టీ మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో మరీ దారుణంగా ఓడిపోయినప్పట్నుంచి.. ఆయన మళ్ళీ సినిమాల్లోకి వస్తే బాగుండు అని ఆయన అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతుందని రుమర్లు వినిపించడం మొదలయింది. అయితే.. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తాను మళ్ళీ సినిమాల్లో నటించేది లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. జనాలు మాత్రం ఆయన సినిమాలు చేస్తేనే బెటర్ అని గట్టిగా భావిస్తున్నారు. అది కూడా “గబ్బర్ సింగ్”తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన హరీష్ శంకర్ దర్శకత్వంలో అంటే ఇంకేం కావాలి.

harish-shankar-about-pawan-kalyan1

అయితే.. ఇదే విషయాన్ని ఇటీవల వాల్మీకి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన హరీష్ శంకర్ ను అడిగితే మాత్రం.. “పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల కలిశాను. చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ ఆ మాటల్లో సినిమా గురించి ప్రస్తావన మాత్రం రాలేదు. “వాల్మీకి” ట్రైలర్ చూసి మాత్రం చాలా బాగుంది అని మెచ్చుకొన్నారు. ఒకవేళ ఆయన సినిమా అవకాశం ఇస్తే ఎందుకు వదులుకొంటాను చెప్పండి.. కుదిరితే ‘గబ్బర్ సింగ్’ను మించిన సినిమా తీస్తాను” అంటూ తన మనసులో మాటను బయట పెట్టాడు హరీష్ శంకర్.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.